day trading mistakes,mistakes in trading





Avoid these 9 mistakes in stock market in Telugu  | stock market Telugu 


మనం తరుచూ వింటుంటం. స్టాక్ మార్కెట్ లో 99 శాతం ట్రేడర్స్ ఫెల్ అవుతారు. ఓన్లీ 1 శాతం ట్రేడర్స్ మాత్రమే సక్సెస్ అవుతారు అని. మరి ఆ ఒక్క శాతం మంది అనుసరించే లేదా 99 శాతం మంది ట్రేడర్స్ చేసే తప్పులని ఈ ఆర్టికల్ లో తెలుసుకోబోతున్నాం. welcome to u2dt.in 


1. NOT GIVING TIME TO LEARN:-

మొదటి తప్పు,  నేర్చుకోవటానికి ప్రాక్టీస్ చేయటానికి టైమ్ ఇవ్వకపోవడం. విక్టరీ వెంకటేష్ సినిమాలో లాగా ఒకే రోజు లో కోటీశ్వరుడు అయిపోదాం అనుకుంటారు చాలా మంది. అయితే కోటి మందిలో ఒకరికో ఇద్దరికో ఇలా అవచ్చు ఏమో కానీ మిగతా అందరికీ మాత్రం ఆ సక్సెస్ కి కావల్సిన టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఇవ్వాల్సిందే. ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఈ సూత్రానికి అతీతం ఏమి కాదు.. వీటిలో కూడా అంతే. సోమవారం స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్నామా... మంగళవారం డబ్బులు వేసామా... బుధవారం ట్రేడ్ చేసామా అనే ఆటిట్యూడ్ తో ఉంటారు చాలా మంది. గురువారానికి సగం డబ్బులు, శుక్రవారానికి మిగతా డబ్బులు పోగొట్టేసుకొని... ఆదివారం తాపీగా కూర్చొని డిసైడ్ అయిపోతారు ఈ ట్రేడింగ్ మనకు వద్దు అని. 

నేర్చుకోవడానికి, ఆబ్సర్వ్ చేయటానికి ప్రాక్టీస్ చేయటానికి తగినంత టైమ్ ఇవ్వాలి అండి తప్పదు. వంటల ప్రోగ్రాం లో ఉప్పు ఎంత వేయాలి అని అంకర్ అడిగితే ఆ కుక్ తగినంత అంటారు. ఇక్కడ కూడా తగినంత అని ఎందుకు అన్నం అంటే కొంత మందికి తక్కువ టైమ్ లోనే వచ్చేస్త్తింది , మరికొంత మందికి ఎక్కువ సమయం పడుతుంది ఈ ప్రాసెస్ మొత్తం నేర్చుకోవడానికి. ఆ టైమ్ మీకు ఎంత కావాలి అని తెలుసుకొని అంత టైమ్ కేటాయించక తప్పదు.. 

what is stock market in Telugu pdf

2. INVESTING IN HUGE AT STARTING ITSELF:-

మొదట్లోనే ఎక్కువ డబ్బులు పెట్టేయడం. నాలెడ్జి అయితే వచ్చేసింది ఇప్పుడు కావాల్సింది ఎక్స్పీరియన్స్ కాబట్టి ట్రేడింగ్ స్టార్ట్ చెయ్యాలి తప్పదు. ఎక్స్పీరియన్స్ రావాలి అంటే నేర్చుకున్నది రియల్ ట్రేడ్ వేసి చూడాలి. ఐతే ఈ స్టేజ్ లోనే చాల మంది వాళ్ళ మొత్తం కాపిటల్ ను తెచ్చి ట్రేడింగ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కానీ మళ్ళీ ట్రేడింగ్ చేయటానికి డబ్బులు ఉండవు. ఇక్కడ నేను చెప్పేది ఏమిటి అంటే... ఈ స్టేజ్ లో మీరు ఎంత డబ్బును అయితే కోల్పోయిన పర్లేదు అనుకుంటారో అంత డబ్బుతో మాత్రమే మొదలు పెట్టండి. ఈ స్టేజ్ లో నేను అయితే ఇంట్రాడే లో ఒక్క షేర్ తో మాత్రమే ప్రాక్టీస్ చేశాను అండి yes ఒక్క షేర్ మాత్రమే...

3. KEEPING STOP LOSS:- 

ట్రేడర్స్ కి మాత్రమే  అండి  ఇది. మనం తీస్కున్న ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ట్ అవుతుంది అని తెలిసి కూడా స్టాప్ లాస్ ని జరుపుతూ ఉంటాం అండి. ఇలా జరాపుతూ జరుపుతూ... మార్కెట్ క్లోజ్ అయ్యే టైమ్ కి మనకు రావాల్సిన లాస్ కంటే ఎక్కువ లాస్ తో బ్రోకర్ ట్రేడ్ క్లోజ్ చేసేస్తాడు. అవసరమా చెప్పండి ఇది మనకు, నేను ఏమంటాను అంటే మీకు మీ స్టాప్ లాస్ హిట్ అయితే ఆ ట్రేడ్ నుండి ఎగ్జిట్ అయిపొండి. మరక మంచిదే అన్నట్లు లాస్ కూడా మంచిదే అండి, ఆ లాస్ కి కారణాలు వెతికి ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చూస్కోవాలి ఇదే ఒక ట్రేడర్ కి ఉండవల్సిన లక్షనం.

4. NOT BEING REALISTIC IN PROFITS:-

ఈ ట్రేడ్ లో నాకు ఇంత పర్సెంటేజ్ లాభం వచ్చేయాలి అనుకుంటారు చాలా మంది. కానీ అక్కడ కొన్ని సార్లు అంత స్కోప్ ఉండక పోవచ్చు. అకడ ఎంత ప్రాఫిట్ చెపుతుందో అంతా తీసుకుని వచ్చేయడం ఉత్హమము. లేదు నాకు ఇంత కర్చులు ఉన్నాయ్ నాకు ఇంత కావాలి అని అలాగే చూస్తూ ఉంటే ఆ వచ్చిన ప్రాఫిట్ కూడా తీసుకొని పోతుంది మార్కెట్. 

5. TRADING FOR TIME PASS OR TO TEST LUCK:-

ఏదో ఒక సైడ్ ఇన్కమ్ వస్తుంది కదా టైమ్ ఉంది మరియు లక్ ని టెస్ట్ చేస్కుందాం అని నేర్చుకోకుండా వస్తారు. మరియు  అప్పుల పాలు అవుతుంటారు చాలామంది. ఇకడ నేను చెప్పేది మీకు తెలిసే అంతా వరకు ట్రేడ్ చేయకండి అస్సలు చేయకండి లేదంటే అస్సామే అండి ఇక. next.....

what is stock market in telugu pdf

6. NOT TRACKING MARKET:-    

నాలెడ్జ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేసిన సరే మార్కెట్స్ ని ట్రాక్ చేయకుండా ఎధో కాళిగా ఉన్నాం కదా అని ట్రేడింగ్ చేస్తుంటారు చాలా మంది. కానీ ఇలా వర్క్ ఔట్ అవ్వదు అండి. సెంటిమెంట్స్ పూర్తిగా తెలుసుకోలేక పోయినా కొంతలో కొంత అవగాహన అయినా మార్కెట్లో ఉండాలి.  లేదంటే మీరు పది రోజులు లేదా నెల రోజులు తెచ్చుకున్న ప్రోఫిట్స్ మొత్తం ఒక రోజు లో పోగొట్టేసుకోగలరు. మార్కెట్ సూత్రం తెలుసు కదా ఒక ట్రేడ్ లొనో లేదా రెండు ట్రెడ్స్ లోనో  ప్రాఫిట్ తెచ్చుకోవడం కాదండి. నెల ఆకరుకి లేదా ఇయర్ ఎండ్ లొనో  లాభాల్లో ఉండాలి అది మీరు చూసుకుంటూ ఉండాలి.

7. TAKING TOO MUCH TRADES :-

చాలా మంది ట్రేడర్స్ నాకు ఇవ్వాళ వచ్చిన ఒక్క ట్రేడ్ అవకాశాన్ని కూడా మిస్ అవ్వొద్దు అని దొరికిన స్క్రిప్ట్ లో దొరికిన ట్రెడ్స్ వేసేస్తుంటారు. వాళ్ళ కాంట్రాక్ట్ నోట్ చూస్తుంటే పది పేజిలు ఇరవై పేజీలు కూడా ఉంటు ఉంటాయి.ఎందుకు ఇలా అంటే... అదో తృప్తి అంటారు.

what is stock market in telugu pdf

8. NOT KEEPING TRADING JOURNAL:- 

ఈ ట్రేడింగ్ జర్నల్ మెంటైన్ చేయటం అనేధి ఒక మంచి అలవాటు ఒక ట్రేడర్ కి. ఎందుకంటే మీరు ఏం తప్పులు చేశారో ఏం ఒప్పులు చేశారో నోట్ చేసుకుంటే, ముందు చేసిన తప్పులను రిపీట్ అవ్వకుండా మరియు ఒప్పులను రిపీట్ చేస్తేనే కదా ట్రేడింగ్ లో సక్సెస్ అయ్యేది. . 

9. TRADING WITHOUT KNOWING THE TREND:-

ఎవరైనా ఒక స్క్రిప్ట్ ట్రెండ్ ఏమిటి అని అడిగితే, ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ అడిగే మొదటి ప్రశ్న యే టైమ్ ఫ్రేమ్ లో అని. డైలీ టైమ్ ఫ్రేమ్ లో మీ తాలూకు ట్రెండ్ ఒకలా ఉంటుంది. వన్ అవర్ లో ఒకలా... 15 నిమిషాలలో ఒకలా ఉంటుంది.  మీరు ట్రేడ్ చెయ్యాలి అనుకుంటున్న టైమ్ ఫ్రేమ్ తాలూకు ట్రెండ్ మీకు తెలియాలి. కొంతలో కొంత అయినా  ట్రెండ్ ని పసిగట్టి ట్రేడ్ వేయటం ఉత్తమం. ...

ఇవండి ఈ ఆర్టికల్ కి మరో ఆర్టికల్ తో మళ్ళీ కలుద్దాం.